Tuesday, April 17, 2012

శశిరేఖా పరిణయం

సంగీతం : మణిశర్మ 



ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
వుబుకు వస్తుంటే సంతోషం   
అదిమి పెడుతుందే వుక్రోషం
తన వెనుక నేను... నా వెనుక తాను
ఎంతవరకీ గాలి పయనం
అడగదే వురికే ఈ వేగం

ముల్లులా బుగ్గను తడిమిందా
మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా
ఆదమరుపో ఆటవిదుపో
కొద్దిగా నిలబడి చూద్దాం... ఈ క్షణం
అంటే కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే ఎదురు తిరిగింది నా హ్రుదయం 

....................................................

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
కలత పడుతోందే లోలోన
కసురుకుంటోందే నా పైన
తన గుబులు నేను... నా దిగులు తాను
కొంచెమైనా పంచుకుంటే
తీరిపోతుందేమో భారం                 

పచ్చగా వున్న పూదోట
నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా వూరంతా
గిచ్చింట్టుందే నన్నంతా
వుండలేను నెమ్మదిగా
ఎందుకంటె తెలియదుగా
తప్పటడుగో తప్పదనుకో
తప్పదే తప్పుకు పోదాం... తక్షణం
అంటూ పట్టుపడుతోంది ఆరాటం
పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం

రచన: అనంత శ్రీరాం
గానం: సైంధవి


Friday, April 6, 2012

శివరంజని

సంగీతం: రమేష్ నాయుడు



పల్లవి
నవమి నాటి వెన్నెల నేను 
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి                   (నవమి)

చరణం 1
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై               (2)
నీ పెదవే పల్లవిగా
నీ నగవే సిగ మల్లికగా
చెరిసగమై యే సగమేదో
మరచిన మన తొలి కలయికలో     (నవమి)

చరణం 1
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై                   (2)
అందాలే నీ హారతిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో      (నవమి)

రచన: వేటూరి
గానం: బాలు, సుశీల

Thursday, April 5, 2012

మాతృదేవోభవ

సంగీతం: కీరవాణి 



పల్లవి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్ని వాయులీనం                         (వేణువై)

చరణం 1
ఏడు కొండలకైనా బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి యీ బంధమే (2)   
నీ కంటిలో నలక లో వెలుగునే కనక
నేను నేననుకుంటె యెద చీకటే
హరీ... హరీ... హరీ
రాయినై వున్నాను ఈనాటికీ
రామ పాదము రాక యేనాటికీ               (వేణువై)

చరణం 2
నీరు కన్నీరాయే వూపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో (2)
ఆ నింగిలో కలిసె నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరేను మట్టి ప్రాణాలు 
హరీ... హరీ... హరీ
రెప్పనై వున్నాను మీ కంటికీ
పాపనై వస్తాను మీ ఇంటికీ                   (వేణువై)

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పొయాను గగనానికి  
గాలినై పొయాను గగనానికీ..

రచన: వేటూరి
గానం: చిత్ర 
 ..............................................................................

పల్లవి 
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేదులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో  చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం        (రాలిపోయే)

చరణం 1
చెదిరింది నీ గుండె గాలిగా
చిలక గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా...
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా...
తిరిగే భూమాతవు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై
ఆశలకే హారతివై                                          (రాలిపోయె)

చరణం 2
అనుబంధమంటేనె అప్పులే
కరిగే బంధలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే...
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే...
పగిలే ఆకాశము నీవై
జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై
తీగ తెగే వీణియవై                                       (రాలిపోయె)

రచన: వేటూరి  
గానం: కీరవాణి 

Wednesday, April 4, 2012

గుప్పెడు మనసు

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ 



పల్లవి
నువ్వేనా...
సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా
నువ్వేనా

చరణం 1
నిన్నేనా అది నేనేనా
కలగన్నానా కనుగొన్నానా
అల్లిబిల్లి పదమల్లేనా
అది అందాల పందిరి వేసేనా 

చరణం 2
కళ్ళేనా హరివిల్లేనా
అది చూపేనా విరి తూపేనా
తుళ్ళి తుళ్ళి పడు వయసేనా
నన్ను తొందర వందర చేసేనా

చరణం 3
నువ్వైనా నీ నీడైనా
యేనాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా
ఇల మల్లెల మాపై విచ్చేనా

రచన: ఆత్రేయ  
గానం: బాలు

అందమె ఆనందం

సంగీతం: సత్యం

పల్లవి
మధుమాస వేళలో
మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ
లేదేలనో

చరణం 1
ఆడింది పూలకొమ్మ
పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో
కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగేవేళ...
ప్రణయాలు పొంగేవేళ
నాలో రగిలే యెదో జ్వాల

చరణం 2
వుదయించె భానుబింబం
వికసించలేదు కమలం
నెలరాజు రాక కోసం
వేచింది కన్నె కుముదం
వలచింది వేదనకేనా...
వలచింది వేదనకేనా
జీవితమంతా దూరాలేనా


రచన: దాశరథి
గానం: బాలు