Thursday, April 5, 2012

మాతృదేవోభవ

సంగీతం: కీరవాణి 



పల్లవి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్ని వాయులీనం                         (వేణువై)

చరణం 1
ఏడు కొండలకైనా బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి యీ బంధమే (2)   
నీ కంటిలో నలక లో వెలుగునే కనక
నేను నేననుకుంటె యెద చీకటే
హరీ... హరీ... హరీ
రాయినై వున్నాను ఈనాటికీ
రామ పాదము రాక యేనాటికీ               (వేణువై)

చరణం 2
నీరు కన్నీరాయే వూపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో (2)
ఆ నింగిలో కలిసె నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరేను మట్టి ప్రాణాలు 
హరీ... హరీ... హరీ
రెప్పనై వున్నాను మీ కంటికీ
పాపనై వస్తాను మీ ఇంటికీ                   (వేణువై)

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పొయాను గగనానికి  
గాలినై పొయాను గగనానికీ..

రచన: వేటూరి
గానం: చిత్ర 
 ..............................................................................

పల్లవి 
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేదులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో  చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం        (రాలిపోయే)

చరణం 1
చెదిరింది నీ గుండె గాలిగా
చిలక గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా...
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా...
తిరిగే భూమాతవు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై
ఆశలకే హారతివై                                          (రాలిపోయె)

చరణం 2
అనుబంధమంటేనె అప్పులే
కరిగే బంధలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే...
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే...
పగిలే ఆకాశము నీవై
జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై
తీగ తెగే వీణియవై                                       (రాలిపోయె)

రచన: వేటూరి  
గానం: కీరవాణి 

No comments:

Post a Comment