Wednesday, July 18, 2012

7/G బృందావన్ కాలనీ 
సంగీతం : యువన్‌ శంకర్‌రాజా


పల్లవి
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకొంటిని
తెరిచి చూసి చదువు వేళ
కాలి పోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికి ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకొంటిని

చరణం 1
కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనిపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలొ వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కానులే ప్రియతమా
కనులూ తెరువుమా

చరణం 2
మధురమైన మాటలు ఎన్నో
క లసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగి పోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడూ పిలిచినా

రచన : ఎ.ఎమ్.రత్నం
గానం : శ్రేయా ఘోషల్

.......................................................................................................................

పల్లవి
కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం నిత్య కలలతో తమ తమ రూపం
వెళ్లి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము
లోకంలో తీయని భాష హృదయంలో పలికే భాష
మెలమెల్లగా వినిపించే ఘోష

చరణం 1
తడి కాని కాళ్ళతోటి కడలికేది సంబంధం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలుగనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
తల్లైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవులే
ఎగిరొచ్చి కొన్ని ఆశలు దూకితే ఆ పూట ఎవరికి సాధ్యములే
ఆ... ఆ... ఆ...

చరణం 2
ఏవైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గ్గెనులే
ఏకాంతం పూసుకొని సంధ్యవేళ పిలిచెనులే
తెల్లవారుజాములన్నీ నిద్రలేక తెలవారే
కనులుమూసి తనలో తానే మాట్లాడతోచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించే
అపుడపుడు చిరుకోపములాగ కరిగెను ఎందుకు మంచులాగ
భూకంపం అది తట్టుకోగలమో మది కంపం అది తట్టుకోదే
ఆ... ఆ... ఆ...

రచన : ఎ.ఎమ్.రత్నం
గానం : హరీష్ రాఘవేంద్ర, మధుమిత, ఉస్తాద్ సుల్తాన్‌ఖాన్

........................................................................................................................

పల్లవి
కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే
ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే

చరణం 1
అడవిలో కాచే వెన్నెల అనుభవించెదెవ్వరులే
కన్నులా అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట
అల కడలి దాటగనే నురగలిక ఒడ్డుకు సొంతమట

చరణం 2
లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే
ఒక పరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి ఢీకొనగా ఈ ముల్లె ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్ర్తీ ఆయలే
ఉప్పొనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే
నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలు రెండు కలసివచ్చులే
ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే

రచన : శివగణేశ్, ఎ.ఎమ్.రత్నం
గానం : హరీష్ రాఘవేంద్ర

.......................................................................................................................

పల్లవి
తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకొంటిని
తెరిచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ బాల
నీకై నేను బ్రతికే ఉంటిని
ఓ... నీలో నన్ను చూసుకొంటిని

చరణం 1
కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగే ఏమని తెలుప
రాలిపోయిన పూల మౌనమా
రాక తెలుపు మువ్వల సడిని దారులడిగే ఏమని తెలుప
పగిలిపోయిన గాజులు పలుకునా
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి
ఒడిన వాలి కథలను చెప్ప సఖియ నేడు ఏది
తొలి స్వప్నం ముగియక మునుపే నిదురే చెదిరెలే

చరణం 2
మధురమైన మాటలు ఎన్నో మారుమోగే చెవిలో నిత్యం
కట్టె కాలు మాటే కాలునా
చెరిగిపోని చూపులు నన్ను ప్రశ్నలడిగే రేయి పగలు
ప్రాణం పోవు రూపం పోవునా
వెంట వచ్చు నీడ కూడ మంట కలిసిపోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేను
ఒకసారి కనిపిస్తావని బ్రతికే ఉంటి నే

రచన : ఎ.ఎమ్.రత్నం
గానం : కె.కె.
ఆదిత్య 369 
సంగీతం : ఇళయరాజా


పల్లవి
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా

చరణం 1
కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్నీ పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని

చరణం 2
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు

రచన : వెన్నెలకంటి
గానం : బాలు, జానకి

................................................................................................................................

పల్లవి
నెరజాణవులే వరవీణవులే
గిలిగించితాలలో ఆహాహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

చరణం 1
మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో
అహహా....
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి ఒంపులలో హంపికలా ఊగే ఉయ్యాల
చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మరి అందుకు విరి పానుపు సవరించవేమిరా

చరణం 2
చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిలిలో
అహహా....
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ పగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా

రచన : వేటూరి
గానం : జిక్కి, బాలు, శైలజ
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
సంగీతం : చక్రి



పల్లవి
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని...
రామచిలుక పిలిచెను ఈ వేళ
అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా
ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా
లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ
మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో
ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో
విహరించనా నీ హృదయాలయంలో

చరణం 1
పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే
జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే
అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే
అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే
నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా
ఇదేగా ప్రేమపండుగ...

చరణం 2
ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే
సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే
ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే
నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే
సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా
సుఖిస్తాను నీ పంచన...

రచన : చంద్రబోస్
గానం : ఎస్.పి.బాలు, కౌసల్య

.................................................................................................................

పల్లవి 
హాయ్ హాయ్ హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
వరాల జల్లే కురిసే
తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్
ఇవాళ మనసే మురిసే
మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్‌లో వాన హాయ్
జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి

చరణం 1
కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా
కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి
మధుర లలన మదన కొలనా కమల వదన అమల సదన
వదల తరమా మదికి వశమా చిలిపి తనమా
చిత్రమైన బంధమాయె అంతలోన
అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా

చరణం 2
గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి
మదిని బరువు పెంచుకుంటూ ఎవరికే ం చెప్పాలి ఏం చేయాలి
అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే
స్పెషలు మనిషైనా కూడ మనకేముంది మామూలే
కళలు తెలుసా ఏమో బహశా కవిత మనిషా కలల హంస
మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగ
మంచి పద్ధతంటూ ఉందిమదిని లాగుతున్నది
ఎంత ఎంత వింతగున్నదీ

రచన : సాయి శ్రీహర్ష
గానం : చక్రి
ఇడియట్ 
సంగీతం : చక్రి



పల్లవి
లేలేత నవ్వులా పింగాని బొమ్మలా
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా
రంగేళి రూపమా బంగాళఖాతమా
ఊరించి చేయకే హైరానా

చరణం 1
ఎట్టా దాచావోగాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయ్ దోరగా
ఒళ్ళే వేడిక్కి ఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంతచొరవా
ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా హో...
నిను చూసినాక నీ మనసు ఆపతరమా
నీ కాలి మువ్వనైపోనా నువు ఊగేటి ఊయలైరానా
నీ పూల పక్కనైపోనా తమలపాకుల్లో పక్కనైరానా
గోదారి తీరమా మంజీరనాదమా
కవ్వింతలెందుకే హాయ్ రామా

చరణం 2
లిల్లీ పూవంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చెయ్ తేరగా
అగ్గే రేగింది నాలో చూశావుగా అది చేసింది ఎంతగొడవా
చిరు చీకటింట చేరాలి కొంటెతనమా
దరి చేరినాక పులకించు పూలవనమా
నీ గోటి గాటునైపోనా మరి నీగుండె గూటికే రానా
ఆ గోరువంకనైపోనా చెలి ఈ వాగువంకనైరానా
నాలోని భాగమా ఆ నీలిమేఘమా
ఇచ్చాక ఎందుకో హైరనా

రచన : భాస్కరభట్ల
గానం : ఉదిత్‌నారాయణ్, కౌసల్య

................................................................................................................................

పల్లవి
ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా
నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐలవ్‌యురా
నిన్నే తలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్‌యురా
కనురాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో
నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా

చరణం 1
కన్నులలోనా వెన్నెలలోనా నీరూపుతోచి
ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే
తొలిసారిగ సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా
అపుడపుడూ తడిమేస్తోంది తడిపేస్తోంది మధువల వానా
ఆనందమై నాలో అనుబంధమై
నీ ప్రేమ నను చేరి మురిపించెరా

చరణం 2
ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా
వికసించే కుసుమంనేనై నినుతాకనా నీలో సడిచేయనా
పనిచేస్తే పక్కన చేరి సందడి చేస్తు గుసగుసలే
పడుతుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై
నీ ప్రేమ కలలెన్నో పండించేరా

రచన : కందికొండ
గానం : కౌసల్య

చంద్రముఖి 
సంగీతం : విద్యాసాగర్


పల్లవి
రారా... సరసకు రారా
రారా చెంతకు చేర...
ప్రాణమే నీదిరా ఏలుకోరా దొరా...
శ్వాసలో శ్వాసవై రారా...

చరణం 1
తోం తోం తోం... తోం తోం తోం
ఆ...  దిరదిన దిరదిన దిరదిన
ఆ... దిరదిన దిరదిన దిరదిన
ఆ ...ఆ ... ఆ ...

నీ పొందు నే కోరి అభిసారికై నేనే వే చాను సుమనోహరా
కాలాన మరుగైన ఆనందరాగాలు వినిపించ నిలిచానురా
తనన ధీంతధీంత ధీంతన... తనన ధీంతధీంత ధీంతన
తనన ధీంతధీంత ధీంతన... తననన
వయసు జ్వాల ఓపలేదురా మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావెరా రావెరా
సలసలసల రగిలిన పరువపు సొద ఇది
తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా... రా రా... రారా...

చరణం 2
ఏ బంధమో ఇది ఏ బంధమో
ఏ జన్మ బంధాల సుమగంధమో
ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో
నయనాల నడయాడు తొలి స్వప్నమో
విరహపు వ్యధలను వినవా ఈ తడబడు తనువును కనవా
మగువల మనసులు తెలిసి నీ వలపును మరచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసన నిలిచితి విరసమె తగదిక
జిగిబిగిజిగిబిగి సొగసుల మొర విని
మిలమిల మగసిరి మెరుపులు మెరివగ రా రా... రా రా... రారా...

రచన : భువనచంద్ర
గానం : బిన్ని కృష్ణకుమార్, టిప్పు

................................................................................................................................

పల్లవి
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి
అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి

చరణం 1
గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం
మదనుడికి పిలుపు మల్లె కాలం మదిలోనె నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెలి కాలం కలనైన తెలుపు కలకాలం
తొలి గిలి కాలం కౌగిలికాలం మన కాలం ఇది... ఆ...

చరణం 2
కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాము కాలం
గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం
తమి తీరకుండు తడి కాలం క్షణమాగనంది ఒడి కాలం
కడిగింది సిగ్గు తొలికాలం మరిగింది మనసు మలి కాలం
మరి సిరికాలం మగసొరి కాలం మన కాలం పదా... ఆ...

రచన : వెన్నెలకంటి
గానం : సుజాత, యదు బాలకృష్ణ



అంతఃపురం
సంగీతం : ఇళయరాజా



పల్లవి
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్నుచూడకా
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం నువ్వు దూరమైతె బతకగలనా

చరణం 1
గోరువెచ్చని ఊసుతో చిన్న బుచ్చక నీ వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయె....
ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహా జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా

చరణం 2
కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ....
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం

రచన : సిరివెన్నెల
గానం : చిత్ర

Wednesday, July 11, 2012

బొమ్మరిల్లు 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్



పల్లవి
బొమ్మనుగీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలనే నాకూ ఉంది
కాని సిగ్గే నన్నూ ఆపింది దానికి సమయం వేరే ఉందంది

చరణం 1
చలిగాలి అంది చలికి వణుకే పుడుతుంది
వెచ్చని కైగిలిగా నిను అల్లుకుపోమ్మంది
చలినే తరిమిసే ఆ కిటుకే తెలుసండి
శ్రమపడిపోకండి తమ సాయం వద్దండి
పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో ఎంత జాలిరా తమరికి నా మీద
ఏం చెయ్యాలమ్మ నీలో ఏదో దాగుంది
నీవైపే నన్నే లాగింది

చరణం 2
అందంగా ఉంది తన వెంటే పది మంది
పడకుండా చూడు అని నా మనసోంటుంది
తమకే తెలియంది నా తోడై ఒక టుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
అయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాటకోసం ఎన్నాళ్ళుగా వేచుంది
నా మనసూ ఎన్నో కలలూ కంటుంది

రచన : బాస్కరభట్ల
గానం : జీన్స్ శ్రీనివాస్, గోపికాపూర్ణిమ

.............................................................................................................................

పల్లవి
పనినినిసా... గమపనిని...
గరిగమగా... గసరిగరీ సనిసా...
నిసా గారిస నిసా నీనిపా
నిసా గారిస పా మపామ గారీస

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

చరణం 1
తీపికన్నా ఇంకా తీయనైన
తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన
చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే
నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

చరణం 2
నన్ను నేనే చాలా తిట్టుకుంటా
నీటో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా
ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే

రచన : అనంత శ్రీరామ్
గానం : సిద్ధార్థ, బృందం

.................................................................................................................................

పల్లవి
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ...
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన
కన్నులు తెరిచే ఉన్నా
నువు నిన్నటికి కలవే అయినా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

చరణం 1
ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంటా నువ్వే లేకుండా
రోజు చూసిన ఏ చోటైనా నను గుర్తిస్త్తుందా
నిలువునా నను తడిమి అల వెనుదిరిగిన చెలిమి అలా
తడి కనులతో నిను వెతికేది ఎలా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ...

చరణం 2
నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ...

రచన : సిరివెన్నెల
గానం : సాగర్, సుమంగళి
బిల్లా 
సంగీతం : మణిశర్మ



పల్లవి
మసాలా మిర్చి పిల్ల మజా చేద్దాం వత్తావా
నసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా
సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా
పో పో రా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా
బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
ఐతే యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ

చరణం 1
కొరివి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా
వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే నీముందరుంది కోరే దారి
బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ

చరణం 2
బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా
శిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామి రంగా
ఐతే సుతి మెత్తంగా గిల్లుకోవా కోవా రావా
బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ
పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ
యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ

రచన : రామజోగయ్యశాస్ర్తి
గానం : హేమచంద్ర, మాళవిక
ఆరు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్




పల్లవి
చూడొద్దే నువు చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్లొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డితో ఇమ్మని అడగొద్దే

చరణం 1
వద్దు వద్దంటూ నీనున్న వయసే గిల్లింది నువ్వేగా
పొ పో పొమ్మంటూ నీనున్న పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న  హృదయాన్ని లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతో నడిచిన నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నాప్రాణం నువ్వై నిలిచావే

చరణం 2
వద్దు వద్దంటూ నువ్వున్నా వలపే పుట్టింది నీపైనా
కాదు కాదంటూ నువ్వున్నా కడలే పొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలిచున్నా
సుడిగుండాల శ్రుతిలయలో వెలుగే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే
ఒంటిగా తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరిగునులే

రచన : చంద్రబోస్
గానం : టిప్పు, సుమంగళి

Tuesday, July 10, 2012

క్రిమినల్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి



పల్లవి
తెలుసా మనసా  ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా  ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

చరణం 1
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా
కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ

చరణం 2
ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా
ప్రాణమే నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ

రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
ఆర్య-2
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్





మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడూ కలిగినట్టి కోపమంత
మొదటిసారి నేను మాట్లాడినప్పుడూ పెరిగినట్టి ద్వేషమంత
మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడూ జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడూ తీరినట్టి భారమంత

తెల్లతెల్లవారి పల్లెటూరిలోనా అల్లుకున్న వెలుగంతా
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవుపాల నురగంతా
చల్లబువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంతా
పెళ్లి ఊడు కొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత

Baby He loves you... loves you... loves you so much
Baby He loves you... loves you... loves you so much

అందమైన కాలకింద తిరిగే నేలకున్న బరువంతా
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంతా
చల్లనైన నీ శ్వాసలోన తొణికే గాలికున్న గతమంతా
చుర్రుమున్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంతా
Baby He loves you... loves you... loves you so much


పంటచేలలోని జీవమంతా
ఘంటసాల పాట భావమంతా
పండ గొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంతా
కుంభకర్ణుడి నిద్దరంతా ఆంజనేయుడీ ఆయువంతా
కృష్ణమూర్తిలో లీలలంతా రామలాలి అంత
Baby He loves you... loves you... loves you so much


పచ్చి వేపపుల్ల చేదు అంతా
రచ్చబండపైన వాదనంతా
అర్ధమైనా కాకపోయినా భక్తి కొద్ది విన్న వేదమంతా
ఏటి నీటిలోన జాబిలంతా
ఏట ఏట వచ్చె జాతరంతా
ఏకపాత్రలో నాటకాలలో నాటుగోలలంత
Baby He loves you... loves you... loves you so much


అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లు పడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంతా
బిక్కుబిక్కుమంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత
Baby He loves you... loves you... loves you so much

ఎంత దగ్గరైన నీకు నాకు మధ్యవున్న అంతులేని దూరమంతా
ఎంత చేరువైన నువ్వు నేను కలసీ చేరలేని తీరమంతా
ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంతా
ఎంత గాయమైన హాయిగానే మార్చే ఆ తీపి స్నేహమంతా
Baby He loves you... loves you... loves you so much


రచన : చంద్రబోస్
గానం : దేవిశ్రీ ప్రసాద్
................................................................................................................................

పల్లవి
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడెంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకీ ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని ఎఫెక్షన్‌లెందుకో
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా

చరణం 1
కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావు
తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరాసరి
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడెంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

చరణం 2
చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా
ఐ లవ్ యు నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడెంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

రచన : బాలాజి
గానం : కె.కె.

.................................................................................................................................

పల్లవి
కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై
ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలేచేనా ప్రేమా

చరణం 1
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా
నా సగమేదో ప్రశ్నగ మారిందా
నేడీ బంధానికి పేరుందా... ఓ...
ఉంటే విడదీసే వీలుందా... ఓ...

చరణం 2
అడిగివన్నీ కాదని పంచిస్తూనే
మరునిమిషంలో అలిగే పసివాడివలే
నీ పెదవులపై వాడని నవ్వులతోన
నువు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే
నా బాధంతటి అందంగా ఉందే
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే... ఓ...
మరుజన్మే క్షణమైనా చాలంతే... ఓ...

రచన : వనమాలి
గానం : కునాల్ గంజావాలా, మేఘ


Thursday, July 5, 2012

బన్ని
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్






పల్లవి
జాబిలమ్మవో... జాజికొమ్మవో...
గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్ యూ
పచ్చబొట్టువో... పుట్టుమచ్చవో...
తేనెపట్టువో ఐ డోన్ట్ నో వాట్ టు డూ
ఇంటి ముందు రంగవల్లివో ఓ చెలి
పెరటిలోని తులసిమొక్కవో
మందిరాన భక్తిపాటవో ఓ ప్రియా
పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై
ప్రాణమై నిలిచినావుగా

చరణం 1
నీ పెదాలపైన నా పెదాలతోన
నీ పెదాలపైన నా పెదాలతోన
ఆ పదాలు నీకు రాసి చూపనా
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఆ జగాలలోని ప్రేమ పంచనా
బొట్టుమీద ఒట్టుపెట్టనా కాటుకల్లె కావలుండనా
గుండెమీద ఒట్టుపెట్టనా అడుగులోన గూడుకట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా

చరణం 2
నీ మనస్సులోకి నా మనస్సుచేరి
నీ మనస్సులోకి నా మనస్సుచేరి
ఆ తపస్సు చేసి ప్రేమపొందగా
నీ వయస్సుతోటి నా వయస్సుతోడై
నీ వయస్సుతోటి నా వయస్సుతోడై
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దుపెట్టనా మూడుముళ్ళ బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా ఏడుజన్మలేకమవ్వనా
రేయికే రాజునై పగటికే బంటునై రాణికే రాజునవ్వనా

రచన : చంద్రబోస్
గానం : సాగర్, మహతి
అంతం
సంగీతం : ఆర్.డి.బర్మన్




పల్లవి
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ... లాలలా ఓ... లాలలాలలా...
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

చరణం 1

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని
నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని
పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని
ఏతోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని

చరణం 2
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ
వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ
నా పెదవిపై నువ్విలాగ చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలిముద్దు పెడుతుందనీ

చరణం 3
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరి సగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమైయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు

రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆనంద్
సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్ 
 


పల్లవి 
యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో

చరణం : 1
ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ
పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా
శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మనసు కథా

మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మనసు కథా

చరణం : 2
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలెదే ప్రేమ
చిగురించే ఋతువళ్ళే విరబూసే ప్రేమ
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మధుర కథా

మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మధుర కథా

రచన : వేటూరి 
గానం : హరిహరన్, చిత్ర 
..........................................................................................................

పల్లవి
నువ్వేనా... నా నువ్వేనా
నువ్వేనా... నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా... ఆనందమేనా...

చరణం 1
మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా... కన్నీరేనా...
తేనెటీగ లాగ కుట్టి తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు
నేనేనా... నీ రూపేనా...
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా... ఆనందమేనా...

చరణం 2
ఆ... కోయిలల్లే వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె కొట్టుకుంటె నవ్వుతావు
ఏ రాగం... ఇది ఏ తాళం...
ఆ... మసక ఎన్నెలల్లే నీవు ఇసక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే... నీ ప్రేమేనా...
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆనందమేనా... ఆనందమేనా...

రచన : వేటూరి
గానం : శ్రేయా ఘోషల్, కె.ఎం.రాధాకృష్ణన్

..........................................................................................................

పల్లవి
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా... గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా
వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా... గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా గాలివాన లాలి పాడేస్తారా

చరణం 1
పిల్లపాపలా వాన బుల్లిపడవలా వాన
చదువు బాధనే తీర్చి సెలవులిచ్చినా వాన
గాలివాన కబాడ్డీ వేడివేడి పకోడి
ఈడు జోడు డీ డీ డీ డీ తోడుండాలి ఓ లేడి
ఇంద్రధనస్సులో తళుకుమనే ఎన్ని రంగులో
ఇంతి సొగసులే తడిసినవి నీటి కొంగులో
శ్రావణమాసాలా జలతరంగం
జీవనరాగాలకిది ఓ మృదంగం
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా గాలివాన లాలి పాడేస్తారా

చరణం 2
కోరి వచ్చిన ఈ వాన గోరువెచ్చనై నాలోన
ముగ్గులా సిగ్గు ముసిరేస్తే ముద్దులాటిదే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు కౌగిలింతల పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో
న ల్లని మేఘాలా మెరుపులందం
తీరని దాహాలా వలపు పందెం
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా గాలివాన లాలి పాడేస్తారా

రచన : వేటూరి
గానం : శ్రేయా ఘోషల్

..........................................................................................................

పల్లవి
తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు
తలచీ వలచీ కలలే కనెనే మనసు
తనువున ఎన్నో తపన లు రేగే
తహ తహలోనే తకదిమి సాగే
తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు
తలచీ వలచీ కలలే కనెనే మనసు

చరణం 1
పొద్దసలే పోక నిద్దర పోనీక
ఎవ్వరిదో కేక ఎద లోతుల దాకా
భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం
రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా
నీ గాలి సోకేనా నా ఊపిరాడేనా
తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు
తలచీ వలచీ కలలే కనెనే మనసు
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే

చరణం 2
నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
బాత్‌రూం సంగీతం లేత ఈడు ఏకాంతం
కోపమొచ్చె నామీద తాపమాయె నీ మీద
దేహాలు రెండైనా ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన విధిలేక పడివున్నా
తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు
తలచీ వలచీ కలలే కనెనే మనసు

రచన : వేటూరి
గానం : శ్రేయాఘోషల్, బృందం




Tuesday, April 17, 2012

శశిరేఖా పరిణయం

సంగీతం : మణిశర్మ 



ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
వుబుకు వస్తుంటే సంతోషం   
అదిమి పెడుతుందే వుక్రోషం
తన వెనుక నేను... నా వెనుక తాను
ఎంతవరకీ గాలి పయనం
అడగదే వురికే ఈ వేగం

ముల్లులా బుగ్గను తడిమిందా
మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా
ఆదమరుపో ఆటవిదుపో
కొద్దిగా నిలబడి చూద్దాం... ఈ క్షణం
అంటే కుదరదంటోంది నా ప్రాణం
కాదంటే ఎదురు తిరిగింది నా హ్రుదయం 

....................................................

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
కలత పడుతోందే లోలోన
కసురుకుంటోందే నా పైన
తన గుబులు నేను... నా దిగులు తాను
కొంచెమైనా పంచుకుంటే
తీరిపోతుందేమో భారం                 

పచ్చగా వున్న పూదోట
నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా వూరంతా
గిచ్చింట్టుందే నన్నంతా
వుండలేను నెమ్మదిగా
ఎందుకంటె తెలియదుగా
తప్పటడుగో తప్పదనుకో
తప్పదే తప్పుకు పోదాం... తక్షణం
అంటూ పట్టుపడుతోంది ఆరాటం
పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం

రచన: అనంత శ్రీరాం
గానం: సైంధవి


Friday, April 6, 2012

శివరంజని

సంగీతం: రమేష్ నాయుడు



పల్లవి
నవమి నాటి వెన్నెల నేను 
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి                   (నవమి)

చరణం 1
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై               (2)
నీ పెదవే పల్లవిగా
నీ నగవే సిగ మల్లికగా
చెరిసగమై యే సగమేదో
మరచిన మన తొలి కలయికలో     (నవమి)

చరణం 1
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై                   (2)
అందాలే నీ హారతిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో      (నవమి)

రచన: వేటూరి
గానం: బాలు, సుశీల

Thursday, April 5, 2012

మాతృదేవోభవ

సంగీతం: కీరవాణి 



పల్లవి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్ని వాయులీనం                         (వేణువై)

చరణం 1
ఏడు కొండలకైనా బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి యీ బంధమే (2)   
నీ కంటిలో నలక లో వెలుగునే కనక
నేను నేననుకుంటె యెద చీకటే
హరీ... హరీ... హరీ
రాయినై వున్నాను ఈనాటికీ
రామ పాదము రాక యేనాటికీ               (వేణువై)

చరణం 2
నీరు కన్నీరాయే వూపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో (2)
ఆ నింగిలో కలిసె నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరేను మట్టి ప్రాణాలు 
హరీ... హరీ... హరీ
రెప్పనై వున్నాను మీ కంటికీ
పాపనై వస్తాను మీ ఇంటికీ                   (వేణువై)

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పొయాను గగనానికి  
గాలినై పొయాను గగనానికీ..

రచన: వేటూరి
గానం: చిత్ర 
 ..............................................................................

పల్లవి 
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేదులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో  చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం        (రాలిపోయే)

చరణం 1
చెదిరింది నీ గుండె గాలిగా
చిలక గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా...
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా...
తిరిగే భూమాతవు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై
ఆశలకే హారతివై                                          (రాలిపోయె)

చరణం 2
అనుబంధమంటేనె అప్పులే
కరిగే బంధలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే...
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే...
పగిలే ఆకాశము నీవై
జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై
తీగ తెగే వీణియవై                                       (రాలిపోయె)

రచన: వేటూరి  
గానం: కీరవాణి 

Wednesday, April 4, 2012

గుప్పెడు మనసు

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ 



పల్లవి
నువ్వేనా...
సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వున నువ్వేనా
గోదారి పొంగున నువ్వేనా
నువ్వేనా

చరణం 1
నిన్నేనా అది నేనేనా
కలగన్నానా కనుగొన్నానా
అల్లిబిల్లి పదమల్లేనా
అది అందాల పందిరి వేసేనా 

చరణం 2
కళ్ళేనా హరివిల్లేనా
అది చూపేనా విరి తూపేనా
తుళ్ళి తుళ్ళి పడు వయసేనా
నన్ను తొందర వందర చేసేనా

చరణం 3
నువ్వైనా నీ నీడైనా
యేనాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా
ఇల మల్లెల మాపై విచ్చేనా

రచన: ఆత్రేయ  
గానం: బాలు

అందమె ఆనందం

సంగీతం: సత్యం

పల్లవి
మధుమాస వేళలో
మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ
లేదేలనో

చరణం 1
ఆడింది పూలకొమ్మ
పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో
కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగేవేళ...
ప్రణయాలు పొంగేవేళ
నాలో రగిలే యెదో జ్వాల

చరణం 2
వుదయించె భానుబింబం
వికసించలేదు కమలం
నెలరాజు రాక కోసం
వేచింది కన్నె కుముదం
వలచింది వేదనకేనా...
వలచింది వేదనకేనా
జీవితమంతా దూరాలేనా


రచన: దాశరథి
గానం: బాలు