Wednesday, July 11, 2012

బొమ్మరిల్లు 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్



పల్లవి
బొమ్మనుగీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలనే నాకూ ఉంది
కాని సిగ్గే నన్నూ ఆపింది దానికి సమయం వేరే ఉందంది

చరణం 1
చలిగాలి అంది చలికి వణుకే పుడుతుంది
వెచ్చని కైగిలిగా నిను అల్లుకుపోమ్మంది
చలినే తరిమిసే ఆ కిటుకే తెలుసండి
శ్రమపడిపోకండి తమ సాయం వద్దండి
పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో ఎంత జాలిరా తమరికి నా మీద
ఏం చెయ్యాలమ్మ నీలో ఏదో దాగుంది
నీవైపే నన్నే లాగింది

చరణం 2
అందంగా ఉంది తన వెంటే పది మంది
పడకుండా చూడు అని నా మనసోంటుంది
తమకే తెలియంది నా తోడై ఒక టుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
అయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాటకోసం ఎన్నాళ్ళుగా వేచుంది
నా మనసూ ఎన్నో కలలూ కంటుంది

రచన : బాస్కరభట్ల
గానం : జీన్స్ శ్రీనివాస్, గోపికాపూర్ణిమ

.............................................................................................................................

పల్లవి
పనినినిసా... గమపనిని...
గరిగమగా... గసరిగరీ సనిసా...
నిసా గారిస నిసా నీనిపా
నిసా గారిస పా మపామ గారీస

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

చరణం 1
తీపికన్నా ఇంకా తీయనైన
తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన
చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే
నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

చరణం 2
నన్ను నేనే చాలా తిట్టుకుంటా
నీటో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా
ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే

రచన : అనంత శ్రీరామ్
గానం : సిద్ధార్థ, బృందం

.................................................................................................................................

పల్లవి
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ...
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన
కన్నులు తెరిచే ఉన్నా
నువు నిన్నటికి కలవే అయినా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

చరణం 1
ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంటా నువ్వే లేకుండా
రోజు చూసిన ఏ చోటైనా నను గుర్తిస్త్తుందా
నిలువునా నను తడిమి అల వెనుదిరిగిన చెలిమి అలా
తడి కనులతో నిను వెతికేది ఎలా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ...

చరణం 2
నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా... ఓ...

రచన : సిరివెన్నెల
గానం : సాగర్, సుమంగళి

No comments:

Post a Comment